Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొద‌టిసారి సూట్ వేసుకున్న ఫొటోను షేర్ చేసిన అమితాబ్‌

  • తన త‌ల్లితో క‌లిసి ఫొటో దిగిన బిగ్‌బీ
  • త‌న స్టైల్‌, ఫ్యాషన్.. త‌ల్లి చలువేన‌న్న సూప‌ర్‌స్టార్‌
  • అల‌హాబాద్‌లో ఈవెంట్ కోసం మొద‌టిసారి సూట్‌
సోష‌ల్‌మీడియాలో క్రియాశీల‌కంగా ఉండే బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇవాళ త‌న చిన్న‌నాటి ఫొటో ఒక‌టి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తాను మొద‌టిసారి సూట్ వేసుకుని, టై క‌ట్టుకుని దిగిన ఫొటో అని అమితాబ్ పేర్కొన్నారు. ఈ ఫొటోలో త‌న త‌ల్లి తేజీ బ‌చ్చ‌న్ కూడా ఉన్నారు.

 'అమ్మ‌, నేను...1950వ ద‌శ‌కం ప్రారంభంలో... నా స్టైల్‌, ఫ్యాష‌న్‌... అమ్మ చ‌లువే. అమ్మ నన్ను తొలిసారిగా సూట్‌, టై వేసుకోమన్నప్పటి ఫొటో ఇది. అల‌హాబాద్‌లో ఓ ఈవెంట్ కోసం' అని అమితాబ్ పోస్ట్ చేశారు. హ‌రివంశ్‌రాయ్ బ‌చ్చ‌న్‌, తేజీ బచ్చ‌న్‌ల‌కు ఇద్ద‌రు కుమారులు. వారిలో అమితాబ్ పెద్ద‌వాడు. రెండో కుమారుడి పేరు అజితాబ్‌.
Amitabh Bachchan
jaya bachchan
teji bachchan

More Telugu News